సూర్యాపేట కేకే మీడియా నవంబర్ 23
*జై తెలంగాణ జై భారత్ నినాదంతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్*
*ధర్మ యుద్ధం చేసేందుకు బరిలోకి జనసేన*
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి జనసేన అభ్యర్థులకు మద్దతుగా బుధవారం జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నందు ఏర్పాటు చేసిన రోడ్ షో లో మాట్లాడుతూ
బిసిల కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలనీ పిలుపు నిచ్చారు.
నీళ్ళు. నియామకాలు నిధులు సాధనకు జనసేన పాటుపడుతుందనీ
2008లో జనసేన పార్టీ స్థాపించ డానికి మూల కారణం నల్లగొండ జిల్లాలో ఆరోజు తమ్ముడు సినిమా విజయవంతనికి వచ్చినప్పుడు ఫ్లోరోసిస్ బాధితులను చూడగానే తనను మనస్సు కలచి వేసిందనీ,
2009 లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ గ్రామాల్లో తిరిగి వాటర్ ప్లాంట్స్ పెట్టేందుకు ముందుకు వస్తే స్థానిక రాజకీయ శక్తులు అడ్డుకున్నాయని తెలిపారు.
అత్యధికంగా ఉన్న బీసీలు రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ,
తనపై ప్రభావం ఎక్కువ గా చూపింది గద్దర్ మాటలేనీ అన్నారు.ఆయన అనారోగ్యంతో ఉన్న సమయంలో కలిస్తే తెలంగాణ గాయపడిందని యువత మహిళలకు భద్రత కరువైందని నీలాంటి వ్యక్తి రాజకీయాలలోకి రావాలని చెప్పడంతో రాజకీయ ప్రస్తావన ప్రారంభించడం జరిగిందనీ అన్నారు.
ఎరుపు మార్పుకు, విప్లవానికి చిహ్నం అని కాషాయం సనాతన ధర్మానికి గుర్తు అన్నారు.
రెండింటినీ కలిపి కుల మతాలకు అతీతంగా పాలన చేస్తున్న మోడీకి మద్దతుగా జనసేన మద్దతు ఇస్తుందని తెలిపారు.తాము రాష్ట్రవ్యాప్తంగా బిజెపితో కలిసి 100 స్థానాల్లో జనసేన ఎనిమిది స్థానాల్లో కోదాడ నుంచి సతీష్ అనే వ్యక్తి పోటీలో ఉన్నాడనీ తెలిపారు.
తెలంగాణలో యువతకు మహిళలకు భద్రతలేదని డబలోఇంజన్ సర్కారు దిశగా జనసేన కృషి చేస్తుందనీ తెలిపారు.
దశాబ్ద కాలంగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని జనసేన నిలబడిందనీ,తనకు తోచినంత ప్రజాసేవ చేయడానికి నిశ్చయించుకుని జనసేనతో రాజకీయ ఆరంగేట్రం చేశాననీ తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో బరిలో నిలుచున్న బిజెపి అభ్యర్థులు సూర్యాపేట సంకినేని వెంకటేశ్వర్ రావు, కోదాడ మేకల సతీష్, తుంగతుర్తి కడియం రామచంద్రయ్య, హుజూర్నగర్ శ్రీలత రెడ్డి లకు జనసేన మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనీ
మీ ప్రేమ భారీ స్వాగతం మన అభ్యర్ధులను గెలిపించుకోవడంలో చూపిస్తే తిరిగి ఇదే చోట మళ్లీ కలుసుకునేందుకు వస్తాననీ తెలిపారు.
తెలంగాణ నేల తల్లికి జేజేలు అని పేర్కొన్నారు.