మేళ్లచెరువు కేకే మీడియా జూన్ 25
హుజూర్నగర్ నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు
ఆదివారం నాడు మేళ్లచెరువులోని పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు ఒక పేద మహిళ షేక్ బాబు భార్య పరిమిన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ సర్జరీకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించగా ఇటీవల చనిపోయిన మహిళ కుటుంబానికి 5,000 రూపాయలు మరియు 1కింట బియ్యం అందించారు అనంతరం మేళ్లచెరువు కి చెందిన
చెంగొడి వెంకటరమణ కుటుంబ సభ్యులు చనిపోగా వారికి 5,000 రూపాయలు మరియు 1 క్వింట బియ్యం అందించి ఆ కుటుంబానికి దైర్యం చెప్పడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓతో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు