నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 4
వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో,పట్టణాల్లో పెద్ద ఎత్తున యువత వినాయక చవితి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే ప్రతిష్టించుకొని, నిమజ్జనం జరుపుకోవాలని సామాజిక కార్యకర్త జింకల భాస్కర్ కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేసిన తర్వాత నీరు కలుషితమై కలరా,టైఫాయిడ్, సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, పంట పొలాల్లో దిగుబడి తగ్గిపోతుందని పేర్కొన్నారు.వర్షాలు, వరదలు వస్తున్న కారణంగా అనారోగ్య బారిన పడకుండా మట్టి వినాయకులపై ఎక్కువ ఆసక్తి చూపాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం నడుం బిగించాలని కోరారు.