నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకొని వాసవి వనితా క్లబ్స్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు పదవ తరగతి చదువుచున్న విద్యార్థిని విద్యార్థులకు స్టడీ అవర్స్ లో కూర్చుని చదువుకునే విధంగా పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న 54 మంది విద్యార్థులకు 54 స్టడీ చైర్స్ 40 వేల రూపాయలు వెచ్చించి అందజేశారు.
ఇటీవల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు విద్యార్థుల ఇబ్బందిని తెలియజేస్తూ వారిని సంప్రదించగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని, వెంటనే స్పందించిన క్లబ్ పాఠశాలలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, వార్డ్ కౌన్సిలర్స్ అమరవరపు లలితా భరత్, ఆర్ నాగయ్య చేతుల మీదుగా అందించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ వాసవి వనిత క్లబ్ నేరేడుచర్ల వారు నిస్వార్థ సేవలతో పేద వర్గాల పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ విధంగా సేవలందించడం మరియు పేదలు,ఆపన్నులకు మరియు ఇంకెన్నోప్రజోపకారార్ధం సేవలందిస్తూ ప్రజాభిమానాన్ని పొందాలన్నారు. కౌన్సిలర్లు లలితా భరత్ నాగయ్య మాట్లాడుతూ వాసవి వనిత క్లబ్ నేరేడుచర్ల వారి సేవలను కొనియాడారు ప్రధానోపాధ్యాయులు బట్టు మధు మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు ఇటీవల పాఠశాలకు విచ్చేసి అధ్యక్షులుగా ఉండి హామీ ఇచ్చిన క్లబ్స్ అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ వీరవెల్లి శ్రీలత లు ప్రస్తుతం జోన్ చైర్మన్ లుగా ఎన్నిక కాబడి మొదటి సేవా కార్యక్రమాన్ని ఈ విధంగా చేపట్ట డం ఆనందదాయకమని నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజంతో పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చే కార్యక్రమమని పేద విద్యార్థులు కలిగిన ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వనిత క్లబ్ ప్రతినిధులు గరినే అరుణకుమారి ఈగ భాగ్యలక్ష్మి గెల్లి మహాలక్ష్మి రాచకొండ శోభ వాసవి క్లబ్ ప్రతినిధులు రాచకొండ శ్రీనివాసరావు, శేఖర్, మాశెట్టి సైదయ్య, పి వి టి, ఊటుకూరు నటరాజ్, గజ్జల కోటేశ్వరరావు, నీలా రామ్మూర్తి, కిషన్, గోపాలకృష్ణ, గరిని ప్రసాద్, ఉప్పల పుల్లయ్య, పోతుగంటి సత్యనారాయణ పరమేశం, మధు,నాగేశ్వరరావు, అనంత సత్యనారాయణ, ఉపాధ్యాయులు నరసకుమారి పద్మావతి, సైదులు, శౌరి, వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, మాధవి, కళ్యాణి, నరసింహరావు రవి, శ్రీనివాసరావు, స్రవంతి, భవాని, కల్పన, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు