సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కేకే మీడియా
జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హైస్కూల్ హుజూర్నగర్ లో శనివారం NSUI పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా ఆధ్వర్యంలో 9, 10 తరగతిలో విద్యార్థినిలకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ తాటికొండ వేణుగోపాల్ రెడ్డి తో మోటివేషనల్ స్పీచ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై విద్యార్థినిలకు అవగాహన కల్పించడం జరిగింది .ఈ కార్యక్రమనీ ఉద్దేశించి శ్రీ వేణుగోపాల్ రెడ్డి ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసం పోటి పరీక్షలను ఎదుర్కోవాలని ప్రతి విద్యార్థి భయాందోళనలు పక్కనపెట్టి తమ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని మీ మీ లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వీడాలని పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసంతో మనం చదువుకున్న, నేర్చుకున్న విషయాలను నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కునే విధంగా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని విద్యార్థుల మనో పరిణితిని పెంచుకొని దృఢ సంకల్పంతో మెలగాలని తెలియజేయడం జరిగింది .అనంతరం విద్యార్థినిలకు ఉన్న సందేహాలను శ్రీ వేణుగోపాల్ రెడ్డి నివృత్తి చేశారు
NSUI పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ విద్యార్థినీలకు కానీ స్కూలుకు సంబంధించిన సమస్యలపై NSUI దృష్టికి తీసుకువచ్చిన ఎడల వాటి పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని షేక్ ముస్తఫా తెలిపారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల రెడ్డి , హెడ్మాస్టర్ లతీఫ్ ,
మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి నరసింహారావు , అధ్యాపక బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు