న్యూఢిల్లీ కేకే మీడియా జూన్ 24:
దేశంలో రాష్ట్రంలో కమ్యూనిస్టుల బలం రోజురోజుకు తగ్గిపోతోంది. ఒకప్పుడు చట్టసభల్లో శాసనకర్తలుగా అధికార పార్టీని ముచ్చమటలు పెట్టించే స్థాయిలో చట్టసభల్లో సభ్యులు ఉండి నేడు అతి తక్కువ స్థానాలకు దిగజారిపోయిన పశ్చిమ బెంగాల్ కేరళ త్రిపుర రాష్ట్రాల్లో వామపక్షాల కూటమి ఎన్నోసార్లు అధికారాన్ని చేర్చికించుకున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని పూర్తిగా కోల్పోయి కేవలం కేరళ కు మాత్రమే పరిమితమైన కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు బలంగా అధికారాన్ని చేసి ఇచ్చుకునే దిశగా ఉరకలు వేసిన కమ్యూనిస్టులు నేడు చట్టసభల కి అడుగు పెట్టడమే మహాభాగ్యంగా కమ్యూనిస్టుల పరిస్థితి తయారయింది. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ కైనా గెలుపోటములు సహజమైనప్పటికీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లలో అటు దేశంలో రోజురోజుకు లీడర్ ఉండి క్యాడర్ లేని సందర్భంగా తయారయింది.
కమ్యూనిస్టులు దూరదృష్టితో వచ్చే అనర్థాలను తిప్పికొట్టే ప్రసంగాలను అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తులైనప్పటికీ నేటి కాలమానానికి తగ్గ మార్పు చెందని సిద్ధాంతాలతో ఒకవైపు సతమతమవుతున్న నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అటు దేశ స్థాయి వరకు నేనే పార్టీ నాయకత్వ బాధ్యతలు ఉండాలి నా అనుచరులే కిందిస్థాయిలో పార్టీ బాధ్యతలుగా ఉండాలి అని చూస్తున్నారు తప్ప రోజురోజుకు కార్యకర్తలు కరిగిపోతున్నారన్న చింతన లేకుండా నేనుంటే చాలు నా వెంట ఒకరు ఇద్దరు ఉంటే చాలు అన్న విధంగా వ్యవహరిస్తున్న నాయకుల తీరుతో ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీలను విశ్వసించి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీ బాటలో నడుస్తున్న ఎన్నో కుటుంబాలు పార్టీని వీడి కొందరు ఇతర పార్టీలకు మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి. కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వ్యక్తులు అతి తక్కువ మంది ఇతర పార్టీల్లో ఇమడగలుగుతారు తప్ప అది కూడా వారి శక్తిసామర్థ్యాలు అండదండలు ఉన్నవారు ఇతర పార్టీలో రాణిస్తున్నారే తప్ప మిగిలిన వారు బూర్జువా పార్టీలతో ప్రయాణం చేయలేక రాజకీయంగా తమ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా చేసుకొని స్తబ్దతగా ఉన్న నాయకులందరూ ఉన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలో ఉన్న పార్టీ లతోపాటు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న పార్టీలు అన్ని తమ తమ క్యాడర్ను నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కమ్యూనిస్టులు మాత్రం తోక పార్టీలు అనే ముద్ర పోగొట్టుకోలేక కొనసాగింపుగా ఎవడు పొత్తులు ఇస్తాడు ఎవరు టికెట్లు ఎక్కువ ఇస్తారు అనే యావలో రాష్ట్రస్థాయిలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న కొందరి పార్లమెంటరీ ప్రమల కారణంగా పార్టీని సర్వనాశనం చేస్తున్న రే తప్ప పార్టీ కింది స్థాయిలో ఎక్కడ పట్టు కోల్పోతుంది పార్టీ పునర్నిర్మానానికి చర్యలు ఎలా తీసుకోవాలి పార్టీ విడి పక్కకు ఉన్న వారిని పార్టీలో తిరిగి ఎలా చేర్చుకోవాలి ప్రజా సమస్యలు ప్రజలను ఆకట్టుకునేలా ఎలా చేయాలన్న అంశాలను పూర్తిగా విస్మరించడంతో ఇటు దేశంలో ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే దశకు చేరుకుంది
దేశంలోనే స్వతహాగా పార్టీ కార్యాలయాలు అధికంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కీటకటలాడిన కార్యాలయాలు నేడు నివ్వెర పోతున్నాయి. ప్రజా సమస్యలు కచ్చితంగా పరిష్కరించబడతాయన్న నమ్మకం లేక ప్రజలు కార్యాలయాల వైపు రావడమే మానేశారు. దీనికి తోడు కొందరు నాయకులు ఎలక్షన్లో కలెక్షన్లు చందాల ద్వారా జీవనానికి అలవాటు పడి ఎవరున్నా లేకున్నా నాయకత్వ బాధ్యతలు మేమున్నాం కదా కొత్తవారు వస్తే మా స్థానం పోతుందన్న భయాందోళనలో నాయకత్వాన్ని పెంచుకునే కార్యకర్తలను పెంచుకునే కనీస ప్రయత్నం చేయకుండా పార్టీని బ్రష్టు పట్టిస్తుండడంతో కమ్యూనిస్టు భావజాలం గల నాయకులు కార్యకర్తలు ప్రజలు నాయకత్వంలో మార్పు రావాలని మీటింగులతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో ప్రజలలోకి వెళ్ళగలిగే ప్రజా సమస్యలను తీసుకొని పోరాతాలు చేసి పాత నాయకత్వాన్ని పాత కార్యకర్తను పార్టీలోకి వచ్చే విధంగా కొత్త రక్తాన్ని తీసుకువస్తేనే దేశంలో కబీర్షులకు మనుగడ తప్ప ఈ తరం అంతరించిపోయాక ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉండేవన్న స్థానానికి దిగజారి పోయే ప్రమాదం ఉంది అనే విశ్లేషకులు భావిస్తున్నారు