పట్టపగులు తాళం వేసిన ఇంట్లో చోరి 8వేల నగదు, 3 గ్రాముల చెవి దిద్దులు, 8తులాల పట్టీలు అపహరణ
కేకే మీడియా నేరేడుచర్ల, ఫిబ్రవరి 1:
పట్టపగులు తాళం వేసిన ఇంట్లో చోరి చేసి రూ.30వేల విలువగల వస్తువులు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన గురువారం నేరేడుచర్ల పట్టణంలో చోటు చేసుకుంది. బాదితరాలు షేక్. సైదాబీ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మహేంద్ర షోరూం వెనక సందులో నివాసం ఉంటున్న తాను పట్టణంలోని పలు గృహాలలో పని చేస్తూ కూలీనాలికీ వెళ్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది. ప్రతి నిత్యం వెళ్లిన విధంగానే తాను గృహాల్లో పని చేయడానికి వెళ్లానని, తన కూతురు స్థానిక ఒక దుకాణంలో గుమస్తాగా పని చేస్తుండగా ఆమె ఇంటికి తాళం వేసి వెళ్లింది. మధ్యాహ్నం మూడు గంటలకు గృహానికి తిరిగి వచ్చే సరికి తలుపుకు వేసిన తాళం పగలగొట్టి ఉందని, లోపలికి వెళ్లి చూస్తే బీరువాలోని రూ. 8వేల నగదు, 3గ్రాముల బంగారపు చెనిబద్ధలు, 8 తులాల వెండి పట్టీలు సుమారు రూ.30వేల విలువగలని అపహరించక పోయినట్లు గుర్తించానని తెలిపింది. నీను పని చేసే యజమానులు ఇచ్చిన నెల జీతం, వచ్చిన పెన్షన్ను బీరువాల్లో దాచుకున్న మొత్తం డబ్బులు దొంగలించినట్లు తెలిపింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ పరమేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సైదాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.