హైదరాబాద్ కేకే మీడియా జూన్ 29
రాష్ట్రంలో కల్తీ లేని వస్తువు లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో వరుస దాడులు చేస్తున్న అధికారులకు దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్తగా నూనె తయారీలో పంది కొవ్వుతో నూనెలు తయారు చేస్తున్నట్లు గమనించి ఒక యువకుడి అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ STO పోలీసుల తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి హైదరాబాద్ నేరేడ్మెట్ కు చెందిన రమేష్ శివ కొన్నేళ్లుగా పంది మాంసం అమ్మే వారి నుంచి కొవ్వును సేకరించి దాన్ని వేడి చేసి వివిధ రకాల కెమికల్స్ ను వాడి నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించారు వాటిని స్థానికంగా ఉన్న ఫాస్ట్ ఫుడ్ దుకాణాలకు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి నిందితున్ని అరెస్టు చేశారు