నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 10
నేరేడుచర్ల మండలంలో సంక్రాంతికి పండుగకు ఊరు విడిచి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని నెరేడుచెర్ల ఎస్ఐ పరమేష్ సూచించారు
బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.సంక్రాంతికి ఇంటికి తాళాలు వేసి ఊరెళ్ళి కుటుంబాలు దొంగతనాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని , తాళాలు పకడ్బందీగా వేసుకోవడంతోపాటు చుట్టుపక్కల వారికి గమనించేలా చెప్పాలన్నారు.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా దొంగలు చోరీ లకు పాల్పడుతుంటారని. ఈక్రమంలో సంక్రాంతికి ఊరెళ్తున్న వారికి పోలీ సులు పలు సూచనలు చేశారు. విలువైన వస్తువులు, డబ్బులను ఇంట్లో ఉంచకుండా లాకర్లలో భద్రపరచాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఊరెళ్తున్నట్లు పోస్ట్ లు చేయకూడదని తెలిపారు. . ఊరెళ్లే ముందు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మంచిదని అనుమానితులు ఎవరైనా కనిపించినప్పుడు చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.