నేరేడుచర్ల కేకే మీడియా ఏప్రిల్ 28:
నేరేడుచర్ల వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల లో న్యాయవాద వృత్తిలో ఉన్న నలుగురు న్యాయవాదులకు శుక్రవారం నాడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆవరణలో ఘనంగా సత్కరించారు.
వాసవి క్లబ్ అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాసవి వనిత క్యాలెండర్ ఇయర్ లో భాగంగా పలు రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిస్టిక్ జనరల్ సెక్రెటరీ రాచకొండ శ్రీనివాసరావు, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ రాచకొండ విజయలక్ష్మి అన్నారు. వాసవి వనిత ఇంటర్నేషనల్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో నేరేడుచర్ల లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో మరింత ముందుకు సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నేరేడుచర్లకు చెందిన న్యాయవాదులు సుంకర క్రాంతి కుమార్, సుంకర ప్రదీప్తి (అనూష), రెడ్డి మల్ల రమణారెడ్డి, చిత్ర విశ్వనాథ్ లను ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమం లో ఐపీసీ G.అరుణ కుమారి డిస్టిక్ ఇంచార్జ్ కందిబండ వాసంతి సెక్రటరీ గజ్జల కోటేశ్వరరావు ట్రెజరర్ పోలిశెట్టి అశోక్ , కంది బండ శ్రీనివాస్, నటరాజ్ వనితా క్లబ్ నేరేడుచర్ల ప్రెసిడెంట్ వీరవెల్లి శ్రీలత సెక్రటరీ పోలీశెట్టి సంధ్య ట్రెజరర్ ఈగ భాగ్యలక్ష్మి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు