నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 1
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో శివాజీ నగర్ లో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద నుండి నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు వివరాల్లోకి వెళితే శివాజీ నగర్ ఎస్సీ కాలనీలో మచ్చ నాగేంద్రబాబు ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అక్కడ పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేయగా 12 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్సై రవీందర్ తెలిపారు వారి వద్ద నుండి నగదు రు 13,970. 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు