సూర్యాపేట జిల్లా వార్తలు
నేరేడ్చర్ల కేకే మీడియా ఫిబ్రవరి 4
లైన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్లకు అంతర్జాతీయ లైన్స్ క్లబ్ వారి సేవలను గుర్తించి ప్రశంసలు అందజేసారు.
ఆదివారం హైదరాబాదులో జరిగిన లైన్స్ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షురాలు పాటి హీల్ వచ్చిన సందర్భంలో 320D ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఉత్తమ సేవలందించిన క్లబ్ లకు ఇచ్చే గౌరవాన్ని నేరేడుచర్ల లైన్స్ క్లబ్ కు అందజేశారు.
ఆపదలు కష్టాల్లో ఉన్నపేద వర్గాలప్రజలపట్ల తమ ఉదారతను ప్రదర్శిస్తూ తమవంతు సహాయం చేసే వ్యక్తులను గుర్తించి లయన్స్ క్లబ్ వేదికగా వారిని మరింత ఉత్సాహంగా పేదలకు సహాయ సహకారాలు అందించే వారిని గుర్తించి వారిని అధిక సంఖ్యలో నేరేడుచర్ల లయన్స్ క్లబ్ లో చేర్పిస్తూ లయన్స్ క్లబ్ ద్వారా సమాజానికి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ను అంతర్జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పాటి హిల్ అభినందించారు సంబంధిత పిన్నును క్లబ్ అధ్యక్షుడు చల్ల ప్రభాకర్ రెడ్డికి ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అత్యంత ధనవంతులు చేసే దానాలకన్నా తనకు కలిగినదానిలో అధికభాగం ఆపన్నులను ఆదుకునే సేవలకై వెచ్చించే సామాన్యులుగొప్ప దానశీలురు అన్నారు హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి లయన్స్ క్లబ్ సదస్సులో నేరేడుచర్ల లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు బట్టు మధు సుంకర క్రాంతి కుమార్ ఎంజెఎఫ్ లయన్ కట్ట శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి జిలకర రామస్వామిలకు లయన్ పిన్నులు బహుకరించారు కార్యక్రమంలో లైన్ డిస్టిక్ గవర్నర్ సిహెచ్ వి శివప్రసాద్ వైస్ డిస్టిక్ గవర్నర్ ప్రభాకర్ రెడ్డి మల్టిపుల్ చైర్ పర్సన్ తీగల మోహనరావు తదితరులు పాల్గొన్నారు