నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 14
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు గురువారం నాడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సూపరిండెంట్ వాజిద్ కు పదిమంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ ప్రతిని అందజేశారు.
మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా 13వ కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ రాజీనామా చేయడంతో కాళీ ఏర్పడగా 14 మందిలో పదిమంది సభ్యులు అవిశ్వాస తీర్మానం కోరుతూ మెమోరాండం అందజేశారు.
అవిశ్వాసానికి ఆమోదం లభిస్తే చైర్మన్ ఎండిపోతావ్ పాటు ఖాళీగా ఉన్న వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.