నేరేడుచర్ల మండల ఎమ్మార్పీఎస్ ఇన్చార్జిగా చిలక బాబు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 30
ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ నేరేడుచర్ల మండల ఇన్చార్జిగా చిలక బాబు మాదిగను నియమించినట్లు హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి పెద పంగు కాటయ్య మాదిగ తెలిపారు. శనివారం నేరేడుచర్ల లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేటి లక్ష్మణ్ మాదిగ నియామక పత్రము అందజేశారని చెప్పారు. మేడి పాపయ్య మాదిగ నాయకత్వంలో సంఘాన్ని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఏబీసీడి వర్గీకరణ కోసం మేడి పాపయ్య పిలుపుమేరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానయ్య మాదిగ, శ్రీకాంత్, లక్ష్మణ్, పెద పంగు నాగేష్, శ్యామ్ , రాజేష్, వడ్లమూడి ఉపేందర్ రావు, పాల్వాయి నాగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.