నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 11
నేరేడుచర్ల మండల తహసీల్దార్ గా సురిగి సైదులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పనిచేసిన వి సరిత చిలుకూరు మండల తాసిల్దార్ గా బదిలీపై వెళ్లగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పెద్దవూర మండలాలలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ విధిలో భాగంగా తహసీల్దార్ ల లో పెద్ద ఊరు నుండి నేరేడుచర్లకు బదిలీపై వచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజూర్నగర్ తాసిల్దారిగా సైదులు బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు తాసిల్దార్ సైదులు మర్యాదపూర్వకంగా కలిశారు