హైదరాబాద్ కేకే మీడియా నవంబర్ 4
నేపాల్లో భూకంప మృతుల సంఖ్య 128కి పెరిగింది.
శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించడంతో జాజర్కోట్, రుకుం పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.
అటు ఉత్తర భారతంలోని ఢిల్లీ, పట్నా, లక్నోల్లోనూ భూమి కంపించింది. కానీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.