హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 11
నేను ఓడిపోయిన మిమ్మల్ని గెలిపిస్తా… మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
*పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన మీకు 24 గంటలు అందుబాటులో ఉంటా..
హుజూర్నగర్ అభివృద్ధి కోసమే వచ్చా ఓడిన గెలిచిన మీ వెంటే
ప్రజా సేవ కోసం రాజకీయాలకు వచ్చానని,ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని నేను ఓడిపోయిన మిమ్మల్ని గెలిపిస్తా అని హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి,మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నియోజక వర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రాజకీయంలో గెలుపు,ఓటములు సహజం నా ప్రాణమున్నంత వరకు హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడుతానని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని,వారిని కాపాడడంలో ముందుంటానని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తానని రానున్న సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ ఇతర ఎన్నికల లక్ష్యంగా నేను ఓడిపోయిన మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా, బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దు,అధైర్యపడొద్దు అని అందరికీ అండగా ఉంటానని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని హుజూర్ నగర్ లోనే ఉంటానని, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని, గెలిచిన వారికి కొంత సమయం ఇద్దామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో హామీలను నెరవేర్చి ప్రజలను సంతోషపెట్టాలని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, మున్సిపాలిటీలలో,గ్రామాల్లో కూడా కొన్ని నిధులు ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని ప్రజల మన్నలను పొందాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అలాగే కాంగ్రెస్ పార్టీ లోని అంతర్గత విభేదాలను ఏవిధంగా ఎదుర్కోవాలని ఐదు సంవత్సరాల పాలన ఏ విధంగా కొనసాగిస్తుందో చూడాలని,కాంగ్రెస్ పాలన ఏమి మార్పు తెస్తుందో అని ఇంకొద్ది రోజులు చూస్తే అందరికి అర్థం అవుతుందని. గతంలో బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని విస్మరించింది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో, ఆరు గ్యారంటీలతో పాటు,రెండు లక్షల రైతు ఋణమాఫీ తో పాటు, ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్,బీసి డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్,రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందో లేక నమ్మి ఓటు వేసిన ప్రజలని మోసం చేస్తుందో లేదో వేచి చూడాలని అన్నారు.రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర హోదాలో,ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించి,ఎన్నికలలో భవిష్యత్తులో మరింత బలంగా,శక్తివంతముగా అధికారంలోకి వస్తుందని గెలుస్తామని అన్నారు.ఎప్పటి లాగానే ఎల్లప్పుడూ మీ మధ్యలోనే ఉంటానని, నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడు కుంటానని,ఈ జీవితం ప్రజా సేవకే అంకితమని, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు 4 సంవత్సరాల కాలం పాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారని,ఈ నాలుగేళ్ళ కాలంలో నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని,అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉందని,పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఏ కష్టం వచ్చిన మీకు 24 గంటలు అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నాయకులు,కార్యకర్తలకు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు,నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు