నేడు అసెంబ్లీలోకి చరిత్రాత్మక బిల్లులు
నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. SCవర్గీకరణకు చట్టబద్ధతతో పాటు BCలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభముందుకు రానుంది. వీటిపై సభలో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది. కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రస్తుతం BCలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.