హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 16
“మాసానాం మార్గశీర్షానాం” అనే శ్రీకృష్ణ భగవానుని గీతా ప్రవచనం ప్రకారం మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్యమాసంలో ముగిసే సమయాన్ని పవిత్రమైన మార్షళి మాసంగా ధనుర్మాసంగా నిర్ణయించి,కలియుగ ప్రారంభం లోనే భూలక్ష్మి అంశతో తులసి వనంలో జనియించిన శ్రీ ఆండాళ్ అమ్మ వారు శ్రీ వ్రతమనే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి తిరుప్పావై అనే ద్రవిడ ప్రబంధాన్ని రచియించి శ్రీ రంగనాథ స్వామి వారికి అర్పించి,భక్తి మార్గం ద్వారా ఆ స్వామివారిని వివాహమాడి మన భక్తులకు ఆదర్శ వంతమై ఆనాటి నుండి శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసో త్సవాలు హుజూర్ నగర్ పట్టణంలో అతి పురాతన మైన దేవాలయంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్య భామ,సమేత శ్రీ వేణు గోపాల,శ్రీ సీతారామచంద్ర స్వామి, స్థానా చార్యులు ముడుంబా శ్రీనివాసా చార్యులు, రామకృష్ణమా చార్యులు, అర్చకులు నరగిరినాధుని నరసింహ చార్యులు,భాస్కరా చార్యులు రంగ భట్టరా చార్యులు, మురళీకృష్ణమా చార్యుల ఆధ్వర్యంలో *ధనుర్మాసంలో జరిగే విశేషమైన ఉత్సవాలు* ఈ నెల 17న ఆదివారం ఉదయం 5-00 లకు గోపూజతో ధనుర్మాసం ప్రారంభం, విష్వక్సేన పూజ, దీక్షాధారణ, భక్తుల గోత్రనామాలతో స్వామి వారికి ఆర్చన,ఉదయం 6-30 లకు తిరుప్పావై సేవాకాలం ప్రారంభం నివేదన,మంగళా శాసనము, శాత్తుమురై, మొదటి పాశర విన్నపం,తీర్ధప్రసాద వినియోగం, ది.23-12-2023న శనివారం వైకుంఠ ఏకాదశి రోజున ఉ5-00 గంటలకు ఉత్తర ద్వార దర్శనం,గ్రామసేవ,సాయంత్రం7-00 గంటలకు గరుడ సేవ,ది. 30-12- 2023న శనివారం రాత్రి 7-00 గంటలకు గజవాహన సేవ, ది. 06-01-2024 శనివారం లక్ష కుంకుమార్చన భాగవత భక్త మహిళామండలి వారిచే నిర్వహిస్తారని, రాత్రి7-00 గంటలకు హనుమంత వాహన సేవ,ది.09-01-2024న మంగళవారం శోభాయాత్ర 9 వాహనాలపై స్వామివార్లు పుర వీధుల దర్శనం రాత్రికి తొండరడి ప్పాళ్వార్ తిరునక్షత్రం,ది. 12-01- 2024 న శుక్రవారం ఉ.5-00 గంటలకు కూడారై ఉత్సవం, 108 గంగాళాలతో పాయసం నివేదన, ది. 13-01- 2024న శనివారం రాత్రి 7-00 గంటలకు శేష వాహన సేవ, ది.14-01- 2024న ఆదివారం భోగి పండుగ చివరి 2 పాశురాల విన్నపం ఉదయం 10-00 గంటలకు శ్రీ గోదా రంగనాధ స్వామి వార్ల కల్యాణ ఉత్సవం, ది.15-01- 2024 న సోమవారం మకర సంక్రాంతి పండుగ అమ్మవారి పల్లకిపై గ్రామోత్సవం,ది.16-01-2024న మంగళవారం సాయంత్రం 5-00 గంటలకు అమ్మవారికి అభిషేక మంజలి ఉత్సవం కనుమ పండుగ రాత్రి 7-00 గంటలకు అద్దాల మండపంలో పవళింపు సేవతో కార్యక్రమం ముగుస్తుందని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి గుజ్జుల కొండారెడ్డి వ తెలిపారు.