కేకే టీవీ ఆగస్టు 30 హైదరాబాద్
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారిచేసింది. ఈరోజు అంటే శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల లో భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హునుమకొండ, ఆదివారం నిజామాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ వివరించింది.