నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 23:
నేరేడుచర్ల మండలం లోని పెంచికలదీన్నే గ్రామపంచాయతీ భవనం శిధిలావస్థకు చేరి అసౌకర్యంగా మారి చాలా సంవత్సరాలు అవుతోంది. సరైన అవసరమైనంత స్థలం అందుబాటులో లేకపోవడం తో వర్షాకాలంలో కురుస్తూ ఎప్పుడు పడిపోతుందా అనంత భయాందోళన కలిగిస్తున్న నేపథ్యంలో గత సంవత్సర కాలంగా గ్రామపంచాయతీని స్థానికంగా ఉన్న లైబ్రరీలోకి పరిపాలన సౌరభ్యానికి మార్చారు. పెద్ద గ్రామ పంచాయతీ కావడం ప్రజల అవసరాలు తీర్చేందుకు అనువైన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా నూతన గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించగా పెంచికల్ తిన్న గ్రామానికి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో 1993లో నిర్మాణం చేపట్టిన ఆ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రస్తుత పంచాయతీ పాలకమండలి కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేసింది అయితే స్థలం తక్కువగా ఉన్నందున దానికి ఆనుకొని ఉన్న పెంచికల్ తిన్న నివాసి ప్రస్తుత హైదరాబాదు నివాసి వల్లంశట్ల రాజేశ్వరరావు ని గ్రామ పెద్దలు సంప్రదించగా ఆనుకొని ఉన్న స్థలంలో కొంత భాగాన్ని బహుమతిగా ఇవ్వడానికి అంగీకరించడంతో గ్రామపంచాయతీ నూతన బిల్డింగ్ నిర్మాణానికి గ్రామపంచాయతీ పాలకమండలి సంబంధిత పనులు చేపట్టింది.