నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 15
మండలంలోని పెంచికల్ దిన్న గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామపంచాయతీ తీర్మానం చేసి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి కొత్తగా మంజూరైన భవన నిర్మాణం కోసం వర్షాలకు నిత్యం కురుస్తూ ఎప్పుడు కూలిపోతుందో అన్న భయాందోళనలో పరిపాలన సాగించలేక తీర్మానం చేసి గ్రామంలో ఉన్న గ్రంథాలయ భవనానికి కార్యాలయాన్ని మార్చి నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనంలోకి శుక్రవారం నాడు అధికారంగా ప్రజలకు పరిపాలన సౌలుభ్యత అందించేందుకు మార్చగా అట్టి కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, నేరేడుచర్ల ఎంపీడీవో శంకరయ్య ముఖ్య అతిధులుగా హాజరు కాగా గ్రామ లో గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వార్డు సభ్యులు పాలకమండలితో పాటు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు.
పెంచికల్ దిన్న సర్పంచ్ సుంకర వాణిశ్రీ రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎల్లబోయిన లింగయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు