నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు నాంది పలకాలి
కెవికె శాస్త్రవేత్త నరేష్
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే టీవీ డిసెంబర్ 27
వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థులు నిత్య పరిశోధనలు చేపట్టాలని కెవికె శాస్త్రవేత్త దొంగరి నరేష్ అన్నారు. బుధవారం ఆయన నేరేడుచర్ల లోని శ్రీ అంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ క్షేత్రం సందర్శన లో భాగంగా మాట్లాడారు. విద్యార్థులు చదువులో భాగంగా నూతన ఆవిష్కరణలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కృషి విజ్ఞాన కేంద్రంలో వర్మి కంపోస్ట్ తయారీ విధానం, మొక్కల పెంపకం,ఇరిగేషన్ పద్ధతులు డ్రిప్ సిస్టం వరి సాగులో చీడపీడలతో సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి దీపపు కాంతుల విధానం వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎ. సైదిరెడ్డి ఉపాధ్యాయులు నాగ ప్రసాద్, యాకూబ్ నాగరాజు, ఆదినారాయణ, రవీందర్ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.