నిర్భయంగా ఓటు వేయండి
నిబంధన ఉల్లంఘిస్తే కేసులు
మూడు దశల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఫ్లయింగ్ స్క్వాడ్, స్పెషల్ స్క్వాడ్స్ తో పర్యవేక్షణ
సమస్యాత్మక గ్రామాలపై నిఘా
ప్రతినిధితో జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట : ప్రతినిధి నరేంద్ర
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అభ్యర్థులు సహకరించాలని ఎవరు నిబంధనలు ఉల్లంఘించిన ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు .గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సున్నితమైన గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి మండలానికి ఒక సీఐ స్థాయి అధికారులను పెట్టామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సూర్యతో మాట్లాడారు .
ప్రతి విడత కు 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత
పల్లెపోరు లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లాలోని 23 మండలాల్లో జరిగే మూడు విడతల ఎన్నికలకు ప్రతి విడత కు 1500 మంది పోలీస్ సిబ్బందిని విధులకు వినియోగిస్తున్నాము. అందులో గ్రామపంచాయతీలో భద్రత రెండు మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఒక ఎస్సై స్థాయి లెవల్ అధికారి రూట్ మొబైల్స్, మండలానికి సిఐ ,డిఎస్పి ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ ,ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. పోలింగ్ కేంద్రాలను ఇద్దరు ఏ ఎస్పీ లు, నలుగురు డిఎస్పీలు ,12 మంది సీఐలు ,55 మంది ఎస్ఐలు నిరంతరం పర్యవేక్షిస్తారు .
గస్తీకి పెట్రోలింగ్ బృందాలు
ప్రతి గ్రామంలో రాత్రిపూట గస్తి కోసం ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీని ఏర్పాటు చేశాం. సాయంత్రం 5 దాటిన తర్వాత ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రటిష్ట బందోబస్తును చేపట్టారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఫ్లైయింగ్ స్క్వాడ్ మండలానికి ఒకటి చెప్పును మొత్తం 50 టీములు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి అలజడి రేగినా క్షణాల్లో అక్కడ పోలీసులు వాలిపోయేలా సిద్ధం చేశాం.
173 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
జిల్లాలో మొత్తం 486 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా ఇందులో మొదటి విడత 159 గ్రామాలకు గాను 47 సమస్యత్మాక గ్రామాలను, రెండో విడతలో 181 గ్రామాలకు 65 ,మూడో విడతలో 146 గ్రామాలకు 58 గ్రామాలను సమస్యత్మాక గ్రామాలుగా గుర్తించాం. ఎన్నికల్లో ఎవరైనా సమస్యలు సృష్టిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరిస్తున్నాం .ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి.
సోషల్ మీడియా పై నజర్
సోషల్ మీడియా పై ప్రత్యేక దృష్టి సారించాం. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ,ఓటముల గురించి కుల ,మతాల ప్రస్తావన తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తప్పవు . ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం ఓటు వేయాలని ,వేయొద్దని ఎవరైనా ఒత్తిడి చేసిన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సంబంధిత సోషల్ మీడియా వాట్సాప్ ,గ్రూపు అడ్మిన్ లపై కేసులు నమోదు చేస్తాం.

