నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 5
నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని తపించే విశ్రాంత ఉపాధ్యాయుడు , లైన్స్ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ ముడుంబై రామానుజాచార్యులు హఠాత్ మరణం చాలా బాధాకరమని , ఏడు పదుల వయసులో సైతం నిత్యం సేవ కోసం పరితపించే సేవ బ్రహ్మ ఇక లేరని తెలియడం అందరిని బాధించిందనీ లైన్స్ క్లబ్ నేరేడుచర్ల అధ్యక్షులు చల్లా ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం నేరేడుచర్ల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతు నేరేడుచర్లకు నేరేడుచర్ల లైన్స్ క్లబ్ కు రామానుజ చార్యులు తో విడదీయరాని బంధం ఉందని అన్నారు. ఆయన మార్గంలో నేరేడుచర్ల లైన్స్ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు నడుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ జెడ్ సి ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, డిసి బట్టు మధు, చార్టెడ్ ప్రెసిడెంట్ కొనతం సీతారాం రెడ్డి, పూర్వాధ్యక్షులు రాచకొండ అంజయ్య ,రాచకొండ రామన్న, సుంకర క్రాంతి కుమార్ సభ్యులు కొప్పుల రంగారెడ్డి, గుండా సత్యనారాయణ, వి లక్ష్మారెడ్డి, ఎస్కే యూసుఫ్ ఏం సైదులు తదితరులు పాల్గొన్నారు.