మిర్యాలగూడ కే కే మీడియా జనవరి 12
మిర్యాలగూడ నియోజకవర్గo లో వివిధ గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీ లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్లతో పాటు ముఖ్య నాయకులతో శుక్రవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
. ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు SC EE DE AE లతో పాటుగా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్ లతో పాటు ముఖ్య నాయకులతో పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ. కోట్ల రూపాయల తో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి సమస్య వివిధ గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీలో కూడా విపరీతంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సత్వరమే వాటిపై తగు నివారణ చర్యలు తీసుకొని తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించాలని నియోజకవర్గంలో ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యతగా నిర్వహించాలని ఉద్యోగులను ఆదేశించినారు
. ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక మన ప్రాంతం రైతులకు సాగర్ కెనాల్ సాగునీరు లేకపోవడం వలన రైతులు చాలా మంది బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తుండడంతో భూగర్భ జలాలు తగ్గి మంచినీటి బోర్లు ఇంకిపోవడం జరుగుతోందని రాబోయే ఎండాకాలంలో ఇంకా విపరీతమైన త్రాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తమై ఇప్పటినుండే అటువంటి సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇకనుండి ప్రతి నెల మొదటి వారంలో త్రాగునీటి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించినారు.
ఈ సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ సి ఈ మధుబాబు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మిషన్ భగీరథ sc వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ ME సాయి లక్ష్మి DE,AE లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..