హుజూర్నగర్ కేకేమీడియా సెప్టెంబర్ 14
ఇలాంటి విజ్ఞాలు కలగకుండా ప్రథమ పూజగా హిందువులు పూజించే గణనాథుడి వినాయక చవితి పండుగ వినాయక నవరాత్రి ఉత్సవాలు మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం హిందువులు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు
ఈ సంవత్సరం వేద పండితులు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 18 న వినాయక చవితి పండుగ జరుగుతుండగా నవరాత్రి ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో మామూలుగానే ఊరు,వాడ, పల్లె ,పట్టణం తేడా లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నగర మూగనున్న తరుణంలో నాయకుల సహకారాలతో ఈ సంవత్సరం మరిన్ని ఎక్కువ గణనాథుల మండపాలతో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వాహన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వర్షాభావ ప్రభావంతో నీటి సమస్య ఏర్పడి చెరువులు కుంటలు బావులు ఎండిపోతున్న పరిస్థితి. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో కెనాన్ల వెంట నీరు రాకపోవడంతో నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జన కార్యక్రమం ఎక్కడ చేయాలనేది ప్రశ్నగా మారింది. తమ సమీప ప్రాంతాల్లో నీ కాలువలలో నిమజ్జనం చేసేవారు సుదూర ప్రాంతాలకు వెళ్లి నిమజ్జనం చేయాలంటే ఈసారి ఎక్కువ విగ్రహాలు ఉండటం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడనుంది.