నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 24
కేంద్ర ప్రభుత్వం కార్మికుల పైన తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేసేంతవరకు కార్మిక లోకం పోరాడాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదిగిరి రావు అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల లోని భవన నిర్మాణ కార్మికులతో కలిసి జన చైతన్య యాత్రల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈనెల 26వ తేదీన నేరేడుచర్ల కు జన చైతన్య యాత్ర బృందం వస్తున్నందున కార్మికులంతా హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ బీసీలు కోల్పోతున్నారని, బిసి జన గణ చేయమంటే కుంటి సాకులతో తప్పించుకుంటుందని, విద్య వైద్య రంగాలను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడం ద్వారా సామాజిక తరగతులకు అందని ద్రాక్ష గానే మిగిలిపోతుందని మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను మూలనపడేసిందని, భేటీ పడావో బేటి బచావో అని ఒక వైపు చెబుతూనే, మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని సిగ్గుగా వదిలిపెడుతుందన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం ఐక్యంగా పోరాడేందుకు జనచైతన్య యాత్రలు జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని, విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిలబడిందన్నారు. ప్రజా సమస్యల పట్ల కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. మతాలకు మంట పెట్టి, కులాల కుట్రలతో బిజెపి తెలంగాణలో రంకేలేస్తుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కులం మతం విద్వేషాలు రెచ్చగొడుతుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, సీనియర్ నాయకులు కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి ఎడ్ల సైదులు , శ్రీను, పాతూరి శ్రీనివాసరావు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు యారవ శ్రీనివాసరావు, గుంజ రవీందర్ ఎస్కే సత్తార్, ఎస్ కే హజరత్, సట్టు. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.