హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 5
నియోజకవర్గ స్థాయి, ప్రజా ప్రతినిధులు , మండల కన్వీనర్లు, ఇన్చార్జిలు , సమన్వయ కర్తలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ..*
*నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి! -హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ..*
ఈరోజు హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు , మండల కన్వీనర్లు, మండల ఇన్చార్జిలు, మండల సమన్వయ కర్తలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం లో ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు పాల్గొని, కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు మాట్లాడుతూ..* బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి.మరో 24 రోజులు అందరూ కలిసి బాగా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థి అనుకోని పని చేయాలి.మనం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.అని నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేయాలి. యుద్ధంలో గెలిచే వరకు, గులాబీ జెండా ఎగిరే వరకు విశ్రమించ్చోద్దు.నాయకులు,కార్యకర్తలు, కార్యోన్ముఖులు అయి, పట్టుదల తో ముందుకుపోవాలి, మన సత్తా ఏంటో చూపించాలి, ప్రతి రోజు అప్రమత్తంగా ఉండాలని, ధైర్యం గా చురుకుగా ఉండాలి అన్నారు. మన పార్టీ బలం నిరూపించాలి, మన శక్తి సామర్ధ్యాలను, ఉపయోగించి,పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు. సీఎం శ్రీ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు తెలియజేయాలి, కొత్త పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ అని మన భారాస పార్టీ అని అన్నారు.అందరూ కలిసికట్టుగా సమన్వయం తో పని చేసి,మరోసారి మన హుజుర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం అందరూ పని చెయ్యాలని, నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడొద్దని ,పేదల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.హుజుర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ,నిబద్ధతతో పని చేసి, హుజుర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. అలాగే ఈ నెల నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
*మరియు ఆ తర్వాత…*
సూర్యాపేట జిల్లా, హుజుర్ నగర్.
*హుజూర్నగర్ పట్టణంలో జరిగిన పలు సమావేశాలకు హాజరైన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గ..*
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం ఉదయం హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు, పాత గ్రామ పంచాయతీ పక్కన, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనం లో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొనడం జరిగింది.ప్రసంగించడం జరిగింది.
మరియు ఆ తర్వాత….
కార్మికుల సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శానంపూడి సైదిరెడ్డి ..*
హుజుర్ నగర్ పట్టణంలోని, మిర్యాలగూడరోడ్ లో ఉన్న వేర్ హౌస్ గోడౌన్ లో హుజుర్ నగర్ నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ ఆధ్వర్యంలో.. జరిగిన వేర్ హౌస్ కార్మికుల సంఘం కార్మికులు, ఉద్యోగుల సమావేశానికి ముఖ్య అతిథిగా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విచ్చేసి, గౌడౌన్ లోని దుర్గమ్మ తల్లి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత సమావేశంలో పాల్గొని, మాట్లాడటం జరిగింది.
*ఈ కార్యక్రమంలో..* హుజుర్ నగర్ మున్సిపాలిటీ స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కార్మికులు,ఉద్యోగులు,తదితరులు పాల్గొన్నారు.