సమర్థ నాయకత్వం కోసం బి ఆర్ఎస్ కేడర్ ఎదురుచూపు
సమర్థవంతమైన నాయకుడు కోసం హుజూర్నగర్ నియోజకవర్గంలోని టిఆర్ఎస్ కేడర్ ఎదురుచూస్తోంది.
2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి అనూహ్యంగా తెరపైకి వచ్చి సాధారణ ఎన్నికల్లో ఓటమి చెందిన శానంపూడి సైదిరెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నలమాధ ఉత్తంకుమార్ రెడ్డి నల్లగొండ నుండి పార్లమెంటు ఎన్నికల్లో గెలవడంతో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా వచ్చిన మద్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన సైదిరెడ్డి తిరిగి 2023 ఎన్నికల్లో రెండవసారి అసెంబ్లీ బరిలో దిగినప్పటికీ ఉత్తం చేతిలో ఓటమి చెందడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించడంతో బిఆర్ఎస్ నాయకత్వం తనను నమ్మించి మోసం చేసిందంటూ సన్నిహితుల వద్ద, ముఖ్య నేతల వద్ద ఆరోపిస్తూ జాతీయస్థాయిలో మళ్లీ అధికారం లోకి వచ్చిన బిజెపి పార్టీలోకి వెళ్లడంతో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ శ్రేణులు తన వెంట ఎవరూ వెళ్ళనప్పటికీ పార్టీ పటిష్టత కోసం కొత్త నాయకుడు లేకపోవడంతో క్యాడర్ ఉన్న లీడర్ లేని పార్టీగా ఉంది ప్రస్తుత టిఆర్ఎస్ పరిస్థితి.
తాత్కాలిక ఇన్చార్జిగా రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డిని పార్టీ అధినాయకత్వం పంపించినప్పటికీ అందుబాటులో లేకపోవడం, కార్యకర్తలు నాయకులు ఆశించిన మేర నాయకుడు కార్యక్రమాలు నిర్వహించడం లేదని సమర్థవంతమైన నాయకుడు వస్తే పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని నాయకులు చెబుతున్నప్పటికీ , గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సైదిరెడ్డి నమ్మి వచ్చిన నాయకులకు సహకారం అందించలేదని అతనిపై ఆరోపణలు చేస్తూ ఇప్పటికే అధికార పార్టీలోకి వలసలు వెళ్ళగా కొందరు ఏ పార్టీలోకి వెళ్లాలన్న ఆలోచనలో స్తబ్దతగా ఉన్న పరిస్థితి, తెలంగాణ , కెసిఆర్ అభిమానులు మాత్రం మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికైనా మేము సిద్ధం మాకు సమర్ధవంతమైన నాయకున్ని అందిస్తే చాలు అని తెగేసి చెబుతున్న పరిస్థితి.
హుజూర్నగర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వస్తాడన్న వదంతులు వచ్చిన నేపథ్యంలో తను మాత్రం వచ్చే సమస్య లేదని , అధికార జాతీయ పార్టీ బిజెపిలోనే సంతోషంగా ఉన్నానని రావాల్సిన అవసరం లేదని రాబోవునని తెగేసి చెబుతున్నాడు అన్న వార్తలు వినవస్తున్నాయి.
నిజం ఏదైనా సదరు మాజీ ఎమ్మెల్యే తిరిగి వచ్చిన హుజూర్నగర్ నియోజకవర్గంలో అతనితోపాటు అందరూ కలిసి వస్తారన్న పరిస్థితి లేదని కొందరు నాయకులు తెగేసి చెబుతున్న పరిస్థితి.
హుజూర్నగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో,ఏపాటి సమర్థవంతమైన నాయకుడ్ని నియమిస్తుందో వేచి చూడాలి మరి.

