మిర్యాలగూడ కే మీడియా మార్చ్ 12
వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కోరారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో చర్చి రోడ్డులో నూతనంగా నిర్మించిన రివర్ మల్టీ స్పెషాలిటి ఆస్పత్రిని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంకెన కోటి రెడ్డి, టీఎస్ ఆర్గోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, బీఆర్ఎస్ నాయకులు నూకల హన్మంత్ రెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకులు షేక్ మధార్ బాబా, కందగట్ల అశోక్, తలకోల శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ మాలవత్ రవీందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.