రైతులకు నాట్ల కష్టాలు…
హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 12:
నాట్లు వేసే కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా రబీకి నీరు రావడంతో ఒక్కసారిగా నాట్ల సీజన్ మొదలవగా ఇప్పటికే బోర్లు బావుల ఆధారంతో నార్లు పెంచిన రైతులు కాలువల నీటితో ఎవరికి వారే నాట్లు ముందు వేసుకోవాలనే తాపత్రయంలో ఉండగా నాట్లు వేసే కూలీలు మాత్రం రోజురోజుకు తగ్గిపోతుండడంతో తీవ్ర కొడతా ఏర్పడి రైతులకు ఇబ్బందిగా తయారైంది.
ఆధునిక వ్యవసాయం లో నాటు యంత్రాలు వచ్చిన అవి పూర్తిస్థాయిలో దిగ్విజయం కాకపోవడం, ప్రత్యామ్నాయ పద్ధతులైన అలుకుడు, డ్రమ్స్ సీడర్లు ఉపయోగించి నాట్లు వేయాలంటే వర్షాలు సరిగా రావటం లేదు కాలువల నీరు వస్తుందో రాదు అన్న భయాందోళనలో దాదాపు అందరూ నాట్లు వేసేందుకే ముక్కు చూపడంతో కూలీలకు బాగా డిమాండ్ పెరిగిపోవడం కొన్ని గ్రామాలలోనే అధికంగా కూలీలు ఉండడం నాట్లు వేయడానికి రైతుల వద్ద వారి వారి అవసరాల కోసం ముందుగానే అడ్వాన్సులు తీసుకున్న కొందరు లీడర్లు వారికే నాట్లు వేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో
ప్రస్తుతం సాగర్ ఎడమ కాల ద్వారా నీరు వచ్చి ఆ నీటితో నాట్లు వేయాలనుకున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
వరి కోతల సమయంలో గతంలో పూర్తిస్థాయిలో మనుషులే కోతలు కోసి కుప్పలు వేసి వడ్లు రాశులు పోసేవారు కానీ ప్రస్తుతం కోత మిషన్లు ఊరికి ఒకటి చొప్పున విపరీతంగా రావడంతో కోతలకు సమస్య లేకుండా పోయింది. కానీ నాట్లకు మాత్రం గతంలో వచ్చిన యంత్రాలు సక్సెస్ కాకపోవడంతో రేటు కూడా రైతులకు అనుకూలంగా లేకపోవడంతో నాటు కూలీలకు డిమాండ్ పెరగగా కొందరు 2000 నుంచి 3000 అదనంగా కూలీలకు ఇచ్చి మరి నాట్లు వేపించుకునే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే వరి రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి ఇప్పుడు నాట్లకు డిమాండ్ పెరగడం అధికంగా ఇచ్చి మరి నాట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి రావడం అదనంగా ఇస్తా అన్న కూడా దొరకని కూలీల తో ఇబ్బందులు పడడం, వేసిన నార్లు ముదిరిపోయే దశకు రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
సాగరాయకట్టుకు నీరు రాక ఒక సమస్య ఉంటే ప్రస్తుతం నీరు వచ్చి నా నాటు కూలీల సమస్యతో సతమతమవుతున్నారు.
ఈ ఆధునిక యుగంలో వ్యవసాయానికి యాంత్రికరణ తోడై రైతుకు నవీన వ్యవసాయాన్ని అందించాల్సిన యంత్రాంగం ప్రభుత్వాలు మాత్రం ఈ సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ఏ ఉచిత పథకం ఇద్దాం ఎలా ఓట్లు ఏపించుకుందామన్న ధ్యాసే తప్ప రాజకీయ నాయకులకు దేశానికి వెన్నెముకైన రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయకపోవడం బాధాకరం.