హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 11
నాకు మీ మీద పూర్తి నమ్మకం ,విశ్వాసం ఉంది . నా గెలుపు బాధ్యత మీదే, గతంలో నిరూపించారు మరోకమారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీదే మీ అందరి రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి. అంటూ హుజూర్నగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భూత్ కమిటీ స్థాయి నుండి వివిధ హోదాల్లో పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం లో శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
శనివారం హుజూర్నగర్ లోని గడ్డి రెడ్డి ఫంక్షన్ హాలులో జరిగిన ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ నన్ను ఉప ఎన్నికల్లో కనీవినీ ఎరుగని మెజారిటీ అందించి నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి ఆశీస్సులతో వేలకోట్ల రూపాయల అభివృద్ధి చేసి చూపించానని, తిరిగి ప్రస్తుత ఎన్నికల్లో నన్ను గెలిపించే బాధ్యత మీదే అని మీ అందరి రుణం తీర్చుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు.
ఒక్క పిలుపుతో మీ సమయాన్ని డబ్బును లెక్కచేయకుండా అశేషంగా తరలివచ్చిన మీ అందరిని నా కుటుంబ సభ్యులుగా భావిస్తా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నేను ఎప్పుడూ పిలిసిన ఏమీ ఆశించకుండా వస్తున్నారంటే నామీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని.
ఇదే ఉత్సాహంతో ఎన్నికల వరకు పనిచేసే మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.