హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 4
హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటు నుండి అటు అటు నుండి ఇటు పార్టీల చేరికల్లో , ప్రచారాల్లో నాయకులు బిజీ బిజీగా ఉండగా నవంబర్ 3 నుండి నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ ఇటు అధికార బి.ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నవంబర్ 9న నామినేషన్ దాఖలకు ముహూర్తం ఖరారు చేయగా , అదే రోజున కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉత్తంకుమార్ రెడ్డి దంపతులు రెండు చోట్ల నామినేషన్లతోపాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో రోడ్ షో ఏర్పాటుకు సన్నాహం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రధాన ప్రత్యర్థులైన అధికార ,ప్రతిపక్ష అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్లు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చ నీ అంశంగా మారింది.