హైదరాబాద్ కేకే మీడియా జనవరి 22
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటును కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
సోమవారం నాడు హైదరాబాదులోని తెలంగాణ భవన్లో జరిగిన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో రానున్న పార్లమెంటు ఎన్నికలు చాలా కీలకమని ప్రతీ కార్యకర్త పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ స్థానాన్ని కైవసం చేసుకునేలా కష్టపడి పని చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఎవరు అధైర్య పడద్దని త్వరలోనే మంచి రోజులు వస్తాయని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ యాదవ్ ఏడు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.