Monday, January 13, 2025
HomeTelanganaనల్లగొండ గడ్డపై గెలిచేది ఎవరో ?

నల్లగొండ గడ్డపై గెలిచేది ఎవరో ?

బ్యూరో కేకే మీడియా నల్లగొండ:

2024 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు స్థానంలో గెలుపు కోసం భగభగ మండే ఎండను సైతం లెక్క చేయక ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి .

కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి:

కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందురు జానారెడ్డి పెద్ద కుమారుడు కొందరు రఘువీర్ రెడ్డి పోటీలో నిలబడ్డారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చి ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని పూర్తిగా నెరవేర్చలేదన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ సహజంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి ఉన్న బలంతో పార్టీలో సీనియర్లుగా ఉన్న ఉద్దండులు జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల అండతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు వివిధ స్థానాల్లో వచ్చిన మెజారిటీ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న కాంగ్రెస్ ను పూర్తిస్థాయిలో ఇప్పుడు పార్లమెంటులో కోరుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ లాంటి పథకాలు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదు అన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ ముందుకు సాగుతున్న తీరుతో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ రాకపోవచ్చు అన్న సందేహం లేకపోలేదు. ఎంపీ అభ్యర్థిగా ఉన్న రఘువీర్ రెడ్డి జానారెడ్డి చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఒకే కుటుంబంలో ఇప్పటికే చిన్న కుమారుడు సాగర అసెంబ్లీ బరిలో నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొంది ఉండగా ఇప్పుడు పెద్ద కుమారుడికి కూడా రాజకీయ ఆరంగేట్రం కోసం చేస్తున్నాడు తప్ప అతను రాజకీయంగా అనుభవం ఏముంది, ఒక్క కుటుంబంలో ఇద్దరికీ అవసరమా, పోటీకి ఇంకెవరూ లేరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభ్యర్థిగా మాటల్లో పదును, చేతుల్లో పనితనం లేకపోవడం కేవలం పార్టీ అండ, తండ్రి అనుభవం, ఉత్తం, కోమటిరెడ్డి ల అండతో స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలంతో గెలవ వచ్చేమో కానీ ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన బలాన్ని పొందకపోవచ్చు అని పరిశీలకు అంచనా…

బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి:

తెలంగాణ ఉద్యమ పార్టీలో అంతగా ప్రభావితం లేని పేరు , నల్లగొండ ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొంది మరోసారి ఓటమి చెందిన కంచర్ల భూపాల్ రెడ్డికి సోదరులుగా మాత్రమే తెలిసిన వ్యక్తి. కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకుడు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సిఫారసుతో నల్లగొండ బరిలో ప్రధాన ప్రతిపక్షమైన బి ర్ యస్ అభ్యర్థిగా నిలబడి ఎన్నికల్లో కాంగ్రెస్కు దీటుగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న గుప్త సుఖేందర్ రెడ్డి కుటుంబ సభ్యుడు కొడుకు అమిత్ రెడ్డి బిఆర్ఎస్ టికెట్ ఆశించి, జిల్లా మాజీ మంత్రి సహకారం లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకోగా తేరా చిన్నపరెడ్డి లాంటివాళ్ళు టికెట్ ఆశించిన ఫలితం లభించకపోవడంతో కృష్ణారెడ్డి బరిలోకి దింపడంలో జగదీశ్వర్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. కానీ ప్రచారంలో దూకుడుగా ఉన్నప్పటికీ కార్యకర్తల్లో నిరుత్సాహం, నాయకుల్లో అభద్రతాభావం నెలకొనడం, పార్లమెంటు పరిధిలో అనేక అసెంబ్లీ స్థానాల నుంచి ప్రధాన నేతలు కాంగ్రెస్కు వలస వెళ్లడం, కొందరు బిజెపి వైపు వెళ్లడం, వారిని నిలుపుదల చేయడంలో జిల్లా పార్టీ పూర్తిగా విఫలం కావడం, నమ్మకం కలిగించే చర్యలు చేపట్టకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
గెలిచేందుకు అవకాశం ఉండి, గెలవకుండా గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థి ఉత్త కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ లభిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్, టిఆర్ఎస్ లు ఉండేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఆపర చాణుక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ నల్లగొండ పార్లమెంటు టికెట్ విషయంలో చెప్పుడు మాటలు విని పార్టీ నీ కష్టాల్లోకి నెట్టి వేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్న పరిస్థితి.
ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో గ్రామీణ పట్టణ స్థాయిలో ఉన్న బిఆర్ఎస్ అభిమానులు కార్యకర్తలు కెసిఆర్ ఏ మళ్లీ రావాలని కోరుకుంటున్న ఎక్కువ శాతం మంది ప్రజల కోరిక కనిపిస్తోందని, కెసిఆర్ ప్రచారానికి ఊవెత్తునా వస్తున్న ప్రజాదరణతో కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సైతం టిఆర్ఎస్ లో బలమైన అభ్యర్థి నిలబడితే మాకు కష్టంగానే ఉండేది అన్న అభిప్రాయం నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులు, కెసిఆర్ అభిమానులు మాత్రం తమ అభ్యర్థి విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం గెలిచింత రాకపోయినా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం జరుగుతోంది.

బిజెపి బరిలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి

దేశంలో పది సంవత్సరాలు అధికారాన్ని చలాయించి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ బాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఉత్తర తెలంగాణకే పరిమితమై ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో నల్లగొండ టికెట్ను సీనియర్ బిజెపి నాయకులను కాదని ఏ మాత్రం కనీసం గతంలో గెలిచిన స్థానంలో అతనిపై ప్రజలకున్న అభిప్రాయాన్ని తెలుసుకోకుండా టిఆర్ఎస్ పార్టీ మారిన వెంటనే బిజెపి ఎంపీ అభ్యర్థి టికెట్ ఇచ్చి బరిలోకి దింపిన శానంపూడి సైదిరెడ్డి సొంత నియోజకవర్గంలో తన వెంట ఎంతో మంది వస్తారని ఆశించిన ఎవరు సుముకథ చూపక పోవడంతో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ మోదీ, బిజెపి పార్టీపై ఉన్న అభిమానమే తప్ప తనకంటూ ప్రత్యేక గుర్తింపు రాకపోవడంతో, గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతనిపై వచ్చిన ఆరోపణలు, బిజెపి నాయకులపై చేయించిన దాడులు, ప్రజలకు అతనిపై ఉన్న వ్యతిరేకత చుట్టుపక్కల నియోజకవర్గాల్లో సైతం అతని నైజాన్ని తెలుసుకోవడంతో స్వతహాగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలన్న కోరికతో ఉన్న అభిమానులు, తాము అభిమానించే మోదీ, బిజెపి కి ఓటు వేయాలా, సైదిరెడ్డి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఓటు వేయకూడదా అన్న సందేహం, అయోమయంలో బిజెపి అభిమానులు ఉన్నారు.
నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో పెరిగినట్టుగానే బిజెపి గ్రాఫ్ నల్లగొండ పార్లమెంటు పరిధిలో పెరగాల్సి ఉండేది కానీ, బిజెపి అభ్యర్థి విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం సరేంది కాదని ఒకవేళ అభ్యర్థిని మార్చి ఉంటే కచ్చితంగా గణనీయమైన ఓట్లు నల్లగొండ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపే విధంగా ఉండేదని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి . కేవలం కొద్ది రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నందున ప్రచారమ్ లో దూసుకుపోతున్నప్పటికీ ఆశించిన ఫలితం ఉండకపోవచ్చునేది అంచనా.
ఎన్నికలకు కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ వ్యాపితంగా అసలు ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నట్లు గా ఈ ఎన్నికలు ఉన్నాయని, ప్రత్యామ్నాయ పోటీదారుడు లేక ఎన్నికలు సప్ప సప్పగా జరగబోతున్నాయని ప్రజలు గోనుక్కుంటున్న పరిస్థితి.
గతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెసు ఉద్దండులు గెలిచి నల్లగొండ చరితను పార్లమెంటులో గొంతు ఎత్తిన నాయకుల సరసన ఎంపీ అభ్యర్థిగా చేరెందుకు ప్రజల తీర్పు ఎవరికి ఇస్తారో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments