- నేరేడుచర్ల కేకే టీవీ జనవరి 4
నేరేడుచర్ల పట్టణములో నడిరోడ్డుపై మిషన్ భగీరథ గుంట తీశారు కానీ.దానిమీద మూత ప్లేట్ వేయడం మరిచారు. ఇది అధికారుల తీరు ఏదైనా ప్రమాదం జరిగితే గాని పట్టించుకోనే విధంగా తయారయ్యారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని కోట్లగడ్డకు పాత నేరేడుచర్లకు పోయే దారిలో సంవత్సరం క్రితం మిషన్ భగీరథ పైపు లైన్ కి మ్యాన్ హోల్ కోసం నడిరోడ్డుపై గుంట తీశారు.దానిమీద ప్లేట్ వేయడం మర్చిపోయారు. దీంతో రాత్రి వేళల్లో అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చిన సందర్భంలో సరిగా కనిపించక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
రాత్రి కానీ పగలు కానీ దగ్గరికి వచ్చే వారికి కనపడటం లేదు. బుధవారం రాత్రి ఒక కారు గుంటలో పడి ప్రమాదం తప్పింది. ఆ గుంట చుట్టూరు ఏమి భారీకేట్స్ అడ్డు గాని ఏమీ పెట్టక పోవడంతో కనిపించక ఈ ప్రమాదం జరిగి వాహనదారుడు ఇబ్బందిపడ్డాడు. అదే ద్విచక్ర వాహనమైతే కచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగేది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి దాని మూయించే ప్రయత్నం కానీ రక్షణ వలయం కానీ ఏర్పాటు చేయాలని లేకుంటే ప్రమాదం పొంచి ఉందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.