నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
సేవ గుణం గల దాతలు ఔదార్యంతో వ్యాపార పరంగా ఆసరా ఇచ్చిన కలిసిమెలిసి జీవించిన ప్రజలకు తిరిగి ఏదో చేయాలన్నా తపనతో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు ఎంతోమంది ఉండి ఏమి చేయకున్నా… ఒకప్పుడు నివసించి ఉన్న ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లి నేరేడుచర్ల పట్టణం, ప్రజలపై మక్కువతో ఏదో చేయాలన్న తపనతో నేరేడుచర్లకు లక్షల రూపాయలు వెచ్చించి వైకుంఠ రథాన్ని, శవపేటిక (ఫ్రీజర్ బాక్స్) లను అందించి అందరికీ ఉపయోగపడాలని మునిసిపాలిటీకి అప్పగిస్తే. ఫ్రీజర్ బాక్స్ తెచ్చిన కొన్ని రోజులకే ఖరాబై నేటికి సుమారు సంవత్సరం గడుస్తున్న కనీసం మున్సిపాలిటీ అధికారులు, పాలకమండలి పట్టించుకోకపోవడంతో దాతలు ఇచ్చిన ఫ్రీజర్ బాక్స్ నిరుపయోగంగా మారింది,
అది సక్రమంగా వినియోగిస్తే మరోకటి సైతం ఇవ్వడానికి సిద్ధంగా దాత ఉన్నప్పటికీ కనీసం చొరవ చూపి దానిని బాగు చేయించే నాధుడే కరువయ్యారు. అంతమంది సిబ్బంది ఉన్నా పాలకమండలి ఉన్న కనీసం అవసరం అప్పుడు దాని గురించి చర్చ చేస్తారే తప్ప పట్టించుకోవడమే మానేశారు.
గతంలో సైతం 70 వేల రూపాయలు వెచ్చించి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేస్తే అప్పుడు కూడా రిపేరు రావడంతో పట్టించుకోకుండా పక్కకు పడవేసి, కనీసం అన్ని వేల రూపాయల విలువ గల వస్తువు ఎక్కడికి వెళ్ళింది అన్న చర్చ ఇప్పటికి రాకపోవడం శోచనీయం.
ఇలాంటి బాధ్యతారాహిత్యమైన అధికార యంత్రాంగం , పాలకుల పట్టించుకోని తనం గ్రామ అవసరాల రీత్యా పేద , మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే దాతలకు ఇవ్వాలన్నా ఎవరూ పట్టించుకోనప్పుడు ఎందుకనే మీమాంస మనసులో పడుతున్నారు.
వేల రూపాయలు వెచ్చించి విలువైన వస్తువులు ప్రజల అవసరార్థం ఇచ్చినప్పుడు కనీసం వాటిని ఎలా ఉపయోగించాలి ఎలా జాగ్రత్తపరచాలని అనే ఆలోచన చేయకపోవడం సమంజసం కాదని ప్రజలు మున్సిపాలిటీ పై అసహనాన్ని , ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు , పాలకమండలి స్పందించి వెంటనే దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
దాతలు ఇచ్చే వస్తువులు మున్సిపాలిటీ ఆస్తిగా భావించి వాటిని జాగ్రత్తగా వాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు.