విషస్వరాలతో సామాన్యుడి జేబుకు చిల్లు
హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 12:
సీజన్ మారిందంటే విషజ్వరాలు దండయాత్ర చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటేనే ఈగలు, దోమల బెడద అధికం. ఇక అవి వాలిన కుట్టిన రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి, వీటికి తోడు పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు .
జ్వరం వచ్చిందంటే చేతికి పట్టి పడ్డట్లే
డాక్టర్ కాని డాక్టర్లు చేసే వైద్యంతో హైడోస్ లతో పాట రేట్లు అన్నట్టుగా వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తూ సామాన్యుని నడ్డి విరుస్తున్నారు.
ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు
ఇంట్లో ఒక్కరికి జ్వరం వచ్చిందంటే వేలాది రూపాయలు ఖర్చయి పోతున్నాయి. అది ఒక్కరితో ఆగకుండా కుటుంబం మొత్తం జ్వరాలు బారిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. దీంతో వారి ఆర్థిక స్థితిగతులు చిన్నభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జ్వరం వచ్చిన ఆ నెలరోజుల పాటు పనిచేసుకోవడం కష్టంగానే ఉంటుంది.
ప్రభుత్వాసుపత్రులు ఎన్ని సౌకర్యాలు కల్పించిన ఏదో ఒక లోపం కారణంగా ప్రజలు ప్రభుత్వాసుపత్రుల దరి చేరలేకపోతున్నారు.
గత్యంతరం లేక పెద్ద ప్రైవేటు దావాఖానాలకు వెళ్లలేక ఆర్ఎంపీలు పీఎంపీ, మెడికల్ దుకాణాల వద్ద వైద్యం చేయించుకున్న సరే వేలాది రూపాయలు ఖర్చవుతుండటం ఆరోగ్యం అనేసరికి డబ్బులు అప్పు చేసిన నయం చేయించుకోవాల్సిన పరిస్థితి రావడంతో
సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.
దోమల సీజన్ కావడంతో ఆయా గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలు దోమల నివారణ కు చర్యలు చేపట్టాలని
పూర్తిస్థాయి అవగాహన కల్పించి విష జ్వరాల బారిన పడకుండా చూడాలని. వైద్యం పై ధరల నియంత్రణ చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.
ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిస్థాయి వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు..