Monday, January 13, 2025
HomeTelanganaదుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు.... కేటీఆర్

దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు…. కేటీఆర్

హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 6:

భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు మీడియా సంస్థలకు కేటీఆర్
సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా హెచ్చరిక జారీ చేశారు.

బిఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది అని ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బిఆర్ఎస్
సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రదాన నిలిపామని తెలిపారు.
ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్నారు.

కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది

ఎప్పటిలానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments