నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 9
నేరేడుచర్ల లైన్స్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మనందలు పొందుతుందని ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం చేయడం అభినందనీయమని నేరేడుదల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు అన్నారు. మంగళవారం నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లా ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన దివ్యాంగుల ఉచిత బస్సు పాస్ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ లైన్స్ క్లబ్ సహకారంతో ఆర్టీసీ సౌజన్యంతో దివ్యాంగులకు అందిస్తున్న ఉచిత సబ్సిడీ బస్సు సౌకర్యంలో దివ్యాంగులు పాల్గొని దీనిని సద్వినియోగం చేయటం అభినందనీయమని ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా అందించే పథకాలు, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థల అందించే సహకారంతో దివ్యాంగుల ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ డిపో మేనేజర్ బి పాల్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రతి సంవత్సరం దివ్యాంగులకు అందిస్తున్న రాయితీ బస్సు సౌకర్య పథకాన్ని లైన్స్ క్లబ్ నేరేడుచర్లలో చేపట్టటం అభినందనీయమని దీనిని ప్రతి ఒక్క వికలాంగులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్, డిస్టిక్ చైర్మన్ బట్టు మధు, నాగయ్య, మాజీ అధ్యక్షులు కొనతం సీతారాంరెడ్డి, పో రెడ్డి శ్రీరామ్ రెడ్డి, సుంకర క్రాంతి కుమార్, కార్యదర్శి జిలకర రామస్వామి, సూరిబాబు, రంగారెడ్డి, గుండ సత్యనారాయణ , వల్లం చెట్ల రమేష్ బాబు కమిషనర్ మున్సిపాలిటీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు