Friday, September 20, 2024
HomeTelanganaదిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది..

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది..

ఢిల్లీ కేకే మీడియా

కవిత, మనీశ్ సిసోదియా కస్టడీని జులై 25 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈడీ కేసులో కవిత, సిసోదియా జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో వీరిని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసు విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు *జులై 25కు వాయిదా వేస్తూ అప్పటి వరకు వారి కస్టడీని పొడిగించింది.*

దిల్లీ హైకోర్టు పిటిషన్ల తిరస్కరణ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దిల్లీ తిహాడ్​ జైలులో జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్​ కోరుతూ దిల్లీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం వాటిని తిరస్కరించింది. కవితను ఈ కేసులో ఇరికించేందుకే ఆరోపణలు చేస్తున్నారని కవిత తరఫు న్యాయవాది వాదించగా ఆమే మద్యం కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అని ఈడీ,సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. వీరిరువురి వాదనలు విన్న న్యాయస్థానం కవిత రెండు పిటిషన్లను కొట్టివేస్తూ బెయిల్​ను తిరస్కరించింది. మరోవైపు ఇవాళ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో జులై 25వ తేదీ వరకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు పరిణామం.
ఈ ఏడాది మార్చి 15న మద్యం కుంభకోణం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు అనంతరం ఆమెను దిల్లీకి తరలించి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆమెకు వారం రోజులు ఈడీ కస్టడీకి ఇస్తూ రౌస్​ అవెన్యూ కోర్టు తెలిపిన విషయం విధితమే. అనంతరం జ్యుడీషియల్​ కస్టడీకి తరలించి ఏప్రిల్​ నెలలో రెండు రోజుల పాటు సీబీఐ విచారణకు ఆమెను కస్టడీలోకి తీసుకుంది. ప్రశ్నల అనంతరం ఆమెను అరెస్టు చేశారు. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్​ విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె తీహాడ్​ జైలులో జ్యుడీషియల్​ కస్టడీలో ఉంటుండగా, పలుమార్లు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. *ఆమెను కలిసేందుకు బీఆర్​ఎస్​ శ్రేణులు తిహాడ్​కు వెళ్లి వస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments