దిర్శించర్ల గ్రామసభలో పాల్గొన్న ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే టీవీ డిసెంబర్ 29
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజాపాలన అభయ హస్తం 6 గ్యారెంటీలో భాగంగా మండలంలోని దిర్శించర్ల గ్రామ పంచాయతి గ్రామ సభలో హుజూర్ నగర్ ఆర్డిఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి జిల్లా పంచాయతి అధికారి యాదయ్య,మండల ప్రత్యేక అధికారి జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ ప్రజలను నుంచి ప్రజా పాలన అభయ హస్తం 6 గ్యారంటీలను దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాపోలు నరసయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ,గ్రామ సర్పంచ్ మాధవి, తహశీల్దార్ సైదులు, ఎస్ఐ పరమేష్, మండల పంచాయతీ అధికారి విజయ కుమారి, విద్యుత్ శాఖ డి. ఈ. ఈ, ఏ. ఈ, గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారి విజయ నిర్మల, వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి రమా, ఆశ వర్కర్లు,తదితరులు పాల్గొన్నారు.