హుజూర్నగర్ కేకే మీడియా జనవరి3
హుజూర్ నగర్ నియోజకవర్గ దస్తావేజు లేఖరుల,స్టాంపు వెండర్ల సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సమావేశంలో అధ్యక్షునిగా నక్క బాలు,ఉపాధ్యక్షులుగా పోతుల దయాసాగర్,ప్రధాన కార్యదర్శిగా షేక్ మీరా,కోశాధికారిగా కాల్వ వీరేష్, సహాయ కార్యదర్శిగా షేక్ షాకీర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల,స్టాంపు వెండర్ల సంక్షేమ సంఘం అభివృద్ధికై,అహర్నిశలు కృషి చేస్తామని, దస్తావేజు లేఖరుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని,తెలంగాణ రాష్ట్రంలో ఇదే వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న దస్తావేజు లేఖరుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా తప్పుల తడకగా ఉన్న ధరణి పోర్టల్ ను రద్దుచేసి పాత పద్ధతిలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరిగే విధంగాచూడాలన్నారు.దస్తావేజులేఖర్ల సంఘం బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.అనంతరం జిల్లా కోఆర్డినేటర్లుగా కాల్వ వెంకటేశ్వర్లు,ఎండి హలీమ్,
గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ అశ్రఫ్ అలీ,షేక్ జానీ పాషా ఎన్నిక య్యారు.దస్తావేజులేఖర్లు స్టాంపు వెండర్ల సంఘం ఎన్నికపై పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖరులు ఆకుల సురేష్, సయ్యద్ జావిద్,రజాక్ బాబా,షేక్ జానీ బాబా,నబి,నరేష్,మహమ్మద్ జానీపాషా,జానీ,జడ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.