దర్గా దగ్గర కనీస సౌకర్యాలు లేక రోజు రోజుకు తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది
రాపోలు నవీన్ కుమార్
సూర్యాపేట జిల్లా పాలకవీడు కేకే మీడియా జనవరి 12
జానపహాడ్ షహిద్ దర్గా ను శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ హుజుర్నగర్ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ సందర్శించి మాట్లాడుతూ
మత సామరస్యానికి ప్రతీక అయిన జాన్ పహాడ్ దర్గా దగ్గర కనీస సౌకర్యాలు లేక రోజు రోజుకు తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది అని
పారిశ్రామిక వాడ గా పేరు గాంచిన ఈ ప్రాంతంలో ఆ పరిశ్రమలు ఈ యొక్క అభివృద్ధి కి సంబంధించిన చర్యలు తీసుకోవాలి అని
వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో జరగాల్సిన ఉర్సు ఉత్సవాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నిర్వహించడం వలన తమ ఇష్టానుసారంగా వసూళ్లుకు పాల్పడుతూ భక్తుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ప్రజా ప్రతినిదులు తమకు కేటాయించిన ఫండ్ నుండి కొంత దర్గా అభివృద్ధి కోసం ఖర్చు చేయవలసి ఉండాలి
అడ్డగోలు వసూళ్ల నుండి దర్గాని కాపాడి దాని ప్రాశస్త్యాన్ని నిలబెట్టాలి అని, అధికారులు సమీక్షా సమావేశాలకే కాలయాపన చేస్తున్నారు అని దర్గానీ ఆనుకోని మద్యం విపరీతంగా అమ్ముతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఏంటి అని ప్రశ్నినించారు
ఈ కార్యక్రమం లో BSP రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేష్ యాదవ్, కర్రీ సతీష్ రెడ్డి, అమరవరపు వెంకటేశ్వర్లు, తక్కెల్ల నాగార్జున పాల్గొన్నారు