- నేరేడుచర్ల కేకే మీడియా జులై 26:
జూలై 30 31 తేదీల్లో మఠంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం సూర్యాపేట జిల్లా స్థాయి కార్యకర్తల చైతన్య సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ గిరిజనసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ పిలుపునిచ్చారు
శుక్రవారం నేరేడుచర్ల మండల కేంద్రంలో కరపత్రం విడుదల చేస్తూ ఆయన మాట్లాడారు గిరిన సంఘం పోరాటాల ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన అభ్యున్నతికికొరకు దత్తసభల్లో ఆమోదించిన చట్టాలను ఉపకార పథకాలను ప్రభుత్వ ఉత్తర్వులను అమలు జరిపించుకునే విధంగా తెలంగాణ గిరిజన సంఘం కార్యకర్తలు యువకులు చైతన్యం చేయడం కొరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కులు ఇవ్వాలని గిరిజన సంఘం రైతులు చేసిన పోరాట ఫలితంగా నాలుగు లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా అందులో సూర్యాపేట జిల్లాలో 4200 ఎకరాల పోడు భూములకు రైతులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు అందులో కేవలం 83 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారని ఇంకా 417 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజన రైతులను గుర్తించి హక్కుపత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు స్థానిక సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కనీస సర్వీసు మూడు సంవత్సరాలకే పర్మెంటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు 15 సంవత్సరాలు దాటినా పర్మెంటు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్న పరిశ్రమ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు గిరిజన హక్కుల కోసం జరిగే జిల్లా స్థాయి సదస్సు ను గిరిజన యువతి యువకులు విద్యావంతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ బాలునాయక్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్ ప్రజా సంఘాల నాయకులు గుర్రం ఏసు వెంకటేశ్వర్లు బుర్రి శ్రీనుశివ తదితరులు పాల్గొన్నారు