Thursday, March 20, 2025
HomeNationalతెలంగాణ గవర్నర్ త్వరలో మార్పు ?

తెలంగాణ గవర్నర్ త్వరలో మార్పు ?

హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 26
*ప్రస్తుత గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ స్థానంలో కొత్త గవర్నర్ నియామకానికి రంగం సిద్ధమైంది.* ఆమెకు బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశాలున్నాయి.

*ప్రస్తుతం గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ పుదుచ్చేరిలో ఉండగా అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి ఈ రోజు రాత్రికి బయలుదేరి వెళ్ళనున్నట్లు* ఢిల్లీ హోంశాఖ వర్గాల సమాచారం. రేపు ఉదయం కేంద్ర హోం మంత్రితో జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వస్తున్నట్లు తెలిసింది. *2019 సెప్టెంబరు 1న ఆమె తెలంగాణ గవర్నర్‌గా నియమితులు కాగా 9న బాధ్యతలు తీసుకున్నారు.* అప్పటి నుంచి ఆమె కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో ఆమె ఐదేండ్ల పదవీకాలం పూర్తి కానున్నది. *లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ నీ మార్చే దిశగా హోంశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.* ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments