నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 8
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా నేరేడుచర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరైన హుజూర్నగర్ శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిందని మహిళల సమాన హక్కుల కోసం పోరాటం చేస్తుందని.
మహిళల ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకునే క్రమంలోనే ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని
ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు 9 రకాల టెస్టులు ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తారని మహిళల ఆరోగ్యంగా బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని పూర్తి విశ్వాసంతోనే అన్ని రంగాల్లో మహిళలకు చేయూతనందిస్తున్న ఏకక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు.
మహిళా దినోత్సవ సందర్భంగా చేపట్టిన ఆరోగ్యమస్తు కార్యక్రమం విజయవంతం చేయాలని సిబ్బందిని కోరారు. ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు ఎంపీపీ జ్యోతి జడ్పిటిసి రాపోలు నరసయ్య ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాహితి, డాక్టర్ నాగిని తదితరు పాల్గొనగా. మహిళా దినోత్సవ సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు