నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 16
తెలంగాణని పాలించే నైతిక హక్కు తెలుగు దేశానికే ఉంది
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు తెలుగుదేశానికే ఉందని తెలంగాణ టిడిపి నల్లగొండ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ నెల్లూరు దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం లో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలోఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు వల్ల కేవలం పార్టీ కార్యకర్తలకు వచ్చే ప్రమాదబీమానే గాక సామాన్య ప్రజలకు అనారోగ్య పరిస్థితిలో వివిధ హాస్పిటల్ యందు చికిత్సలకు అయ్యే ఖర్చులలో రాయితీ పొందవచ్చుననీ .. నేరేడుచర్ల లో పార్టీ హయాంలో నిర్మించిన గృహాలే నేటికీ కనిపిస్తున్నాయనీ కనిపిస్తున్నాయనీ ప్రభుత్వం ప్రభుత్వం తాత్కాలిక తాత్కాలిక మాత్రమే ఆశచూపుతూ కాలం కాలం ఎల్లదీస్తున్నదనీ ఎల్లదీస్తున్నదనీ ఉద్యోగాలపట్ల చట్టబద్ధత విధ లేని విధంగా జీ ఓ లను జారీచేస్తూ .. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదనీ .. తెలుగుదేశం పార్టీ కి పూర్వవైభవం అనేది ఈ రోజు మీరు చూపించిన ఆప్యాయత, మద్దతు సాక్షిగా చెప్పవచ్చుఅని ప్రతి కార్య కర్త పార్టీ బలపడుటకు కృషి చేయాలని వారు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యాక తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని ఎంతోమంది బడుగు బలహీన వర్గ కొత్త నాయకత్వాన్ని రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసింది అని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన పునాదులు ఉన్నాయని. జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారం దిశగా పరుగులు తీస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు
నూతనంగా ఎన్నికైన నేరేడుచర్ల మున్సిపల్ కన్వీనర్ పొనుగోటి జంగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేరేడుచర్ల ., మండల కన్వీనర్ ఇంజమూరి వెంకటయ్య, టిడిపి రాష్ట్ర నాయకుడు పాల్వాయి రమేష్,,.పచ్చిపాల వెంకన్న యాదవ్, యడవల్లి వెంకట రెడ్డి, ఏనుగంటి పుల్లయ్య చౌదరి, చింతల
నర్సింహరావు,
7, 8 వ వార్డు నాయకులు సామ సైదులు, చందమళ్ళ వెంకన్న, శ్రీనేని శ్రీరాములు, బొల్లెద్దు నాగేష్, బూషి నాగరాజు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు