హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 29
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారక చిహ్నం గా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేసే సందర్భంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించిన మేరకు వెళ్లి న చంద్రబాబు ఇతర పనుల నిమిత్తం ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 119 స్థానాలకు పోటీ చేసే అవకాశాన్ని తెలంగాణ తెలుగుదేశం కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విషయం లో పొత్తులు ఎవరితో ఉంటాయని అడిగిన ప్రశ్నలకు అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయని తెలిపారు.